: భద్రత విషయంలో రాజీ ప్రసక్తే లేదు: రాజ్ నాథ్ సింగ్
దేశ అంతర్గత భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇటీవల పోరుబందర్ తీరంలో చోటు చేసుకున్న బోటు ఘటన నేపథ్యంలో ఢిల్లీలో నిర్వహించిన భద్రతా దళాల ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ భద్రత విషయంలో రాజీ మాటే లేదని అన్నారు. ఉగ్రవాదుల విషయంలో కఠినంగా వ్యవహరించండని ఆయన భద్రతా దళాల ఉన్నతాధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)ల చీఫ్ లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.