: జగన్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు: మంత్రి ప్రత్తిపాటి
రాజధాని కోసం రైతుల భూములను బలవంతంగా, అక్రమంగా లాక్కుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, వైసీపీ పంటపొలాలు దహనం చేసే కార్యక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, తాను కూడా ముఖ్యమంత్రి అవుతానని భావిస్తున్న జగన్ అసలు అధికారంలోకి వచ్చే అవకాశం ఎప్పటికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. అటువంటప్పుడు జగన్ రైతులకు భూములు ఎలా తిరిగిస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రైతులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.