: జమ్మూ కాశ్మీర్లో ఎటూ తేల్చుకోలేకపోతున్న బీజేపీ


జమ్మూ కాశ్మీర్ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీలో సమావేశమయ్యారు. కాశ్మీర్ లో ఎన్నికల ఫలితాలు వెలువడి నేటికి 13 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటికీ అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై ఓ స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో, పీడీపీకి బీజేపీ మద్దతివ్వడంపై ఆ రాష్ట్ర పార్టీ నేతలతో అమిత్ షా చర్చిస్తున్నారు. పీడీపీకి మద్దతివ్వాలా? వద్దా? అనే దానిపై నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. చర్చ అనంతరం పొత్తు, ప్రభుత్వ ఏర్పాటుపై ఓ స్పష్టత వస్తుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News