: ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు పూర్తి
ప్రముఖ సినీ నటుడు ఆహుతి ప్రసాద్ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం పూర్తయ్యాయి. కేన్సర్ బారిన పడ్డ ఆయన నిన్న మధ్యాహ్నం కిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. నేటి ఉదయం 10 గంటలకు ఫిల్మ్ నగర్ లో ప్రారంభమైన అంతిమ యాత్ర తెలుగు సినీ అభిమానులు, పలువురు చిత్ర రంగ ప్రముఖుల అశ్రునయనాల మధ్య ఎర్రగడ్డ శ్మశాన వాటికకు చేరుకుంది. అక్కడ ఆయన చితికి కుమారుడు నిప్పంటించారు.