: రెండు రాష్ట్రాల్లో 97 పోస్టాఫీసుల్లో ఈ-దర్శనం టికెట్లు: టీటీడీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం 97 పోస్టాఫీసుల్లో ఈ-దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచినట్టు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. అందులో భాగాంగానే ప్రతి రోజు ఐదువేల టికెట్ల చొప్పున ఇస్తున్నట్టు చెప్పారు. తిరుపతి హెడ్ పోస్టాఫీసులో ఈ-దర్శనం టికెట్లను ఈరోజు ఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ-దర్శనం టికెట్లను ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. కాగా భక్తుల సౌకర్యం మేర శ్రీవారి ఈ-దర్శనం టికెట్లను ఇప్పటికే టీటీడీ పలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే.