: డబ్బులిచ్చి మరీ లెంపకాయ కొట్టించుకున్న బాలీవుడ్ నటి!


జనంలోకి పొట్టిదుస్తులతో వస్తావా? అంటూ, ఓ యువకుడు బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్ ను అందరిముందూ చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కథ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. గౌహర్ ఖానే పబ్లిసిటీ కోసం డబ్బులిచ్చి అలా చేయమని చెప్పిందట. ఖాన్ పై దాడి చేసిన యువకుడు మహమ్మద్ అఖిల్ మాలిక్ ఆంగ్ల మీడియాకు ఈ విషయాన్ని చెప్పాడు. కొంత డబ్బుతో పాటు దబాంగ్-3 చిత్రంలో అవకాశం కూడా ఇప్పిస్తానని ఆమె హామీ ఇచ్చిందని అఖిల్ మాలిక్ చెబుతున్నాడు. ఘటనకు మూడు రోజుల ముందు ఆమెను కలిసినట్టు తెలిపాడు. గౌహర్ ఖాన్ మాత్రం అలాంటి ఒప్పందం ఏదీ లేదని, మాలిక్ ఎవరో తనకు తెలియదని ట్విట్టర్‌ లో పేర్కొంది.

  • Loading...

More Telugu News