: సోషల్ మీడియాలో చంద్రబాబు హవా... యూట్యూబ్ లో బాబు వీడియో హల్ చల్!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పాలనతోనే కాదండోయ్, సోషల్ నెట్ వర్క్ లోనూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో చేరిపోయిన చంద్రబాబు... ఫేస్ బుక్ లో 3,39,248 మంది, ట్విట్టర్లో 4,40,000 మంది ఫాలోయర్లను కలిగి ఉన్నారు. ఇక ఇటీవల గూగుల్ హ్యాంగవుట్ ద్వారా ప్రజలను కలుసుకున్న చంద్రబాబు కార్యక్రమానికి సంబంధించిన వీడియోకు భారీ ఆదరణ లభిస్తోంది. యువత అభిరుచులు, మనోభావాలను తెలుసుకునేందుకు చంద్రబాబు డిసెంబర్ 20న గూగుల్ హ్యాంగవుట్ లో ఓ టీవీ ఛానెల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. నాడు సదరు ఛానెల్ తో పాటు యూట్యూబ్ లోనూ ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమైంది. తాజాగా ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఏపీ సర్కారు అధికారిక వెబ్ పోర్టల్ నుంచే 2,11,194 మంది ఈ వీడియోను వీక్షించడం గమనార్హం.