: యువీ వరల్డ్ కప్ ఆడే ఛాన్స్ ఇంకా ఉందా?
టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఆటతీరు పరిశీలిస్తున్న క్రీడా విశ్లేషకులు యువీకి వరల్డ్ కప్ లో ఆడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో చోటు దక్కుతుందని, తాను వరల్డ్ కప్ ఆడుతానని, క్యాన్సర్ నుంచి కోలుకున్న అనంతరం ఫాం కోల్పయిన దశలో యువీ పేర్కొన్నాడు. అయితే యువీ ఫాంను పరిగణనలోకి తీసుకున్న సెలెక్టర్లు అతనిని వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లోకి తీసుకోలేదు. దీంతో యువీకి అన్యాయం జరిగిందని సగటు అభిమాని భావించినప్పటికీ, టీమిండియా భవిష్యత్ దృష్ట్యా సెలెక్టెర్లే కరెక్ట్ అని భావించారు. కానీ, మహమ్మారి క్యాన్సర్ నే జయించిన యువరాజ్ సింగ్ మాత్రం దీనిని తేలిగ్గా తీసుకోలేకపోయాడు. తనను విస్మరించారన్న కసితోనే, వరల్డ్ కప్ లో ఎలాగైనా ఆడాలన్న కోరికతోనో రంజీల్లో బౌలర్లను ఆటాడుకున్నాడు. దీంతో సెలెక్టర్లు తాము ఎంత తప్పుచేశామో తెలిసివచ్చేలా చేశాడు. ఇంతలో ఆసీస్ పర్యటనలో రవీంద్ర జడేజా గాయపడ్డాడు. ఈ నెల 7వ తేదీ లోపు వరల్డ్ కప్ లో పాల్గొనే జట్లు తమ ఆటగాళ్ల తుదిజాబితాను ప్రకటించాలి. ఈ నేపధ్యంలో జడేజా కోలుకోవాలి, అలా జరగని పక్షంలో యువీని తుది జట్టులోకి తీసుకునే వీలుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ప్రాబబుల్స్ లోకి ఎంపిక కానప్పటికీ వైద్య కారణాల చూపించి తుది జట్టులోకి యువీని ఎంపిక చేసుకోవచ్చని చెబుతున్నారు.