: మమతా బెనర్జీ మేనల్లుడికి చెంపదెబ్బ
రాజకీయ నేతలపై ఇంకు చల్లే కాలం, చెప్పులు విసిరే కాలం అంతమైంది. పశ్చిమ బెంగాల్ లో కొత్త సీజన్ షురూ అయింది. అక్కడి తూర్పు మిడ్నాపూర్ లో జరిగిన ఓ సభలో సీఎం మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ పాల్గొన్నారు. అదే పార్టీకి చెందిన ఓ కార్యకర్త దూసుకువచ్చి అభిషేక్ చెంప ఛెళ్లు మనిపించాడు. దీంతో తృణమూల్ కార్యకర్తలు అతడిని పట్టుకుని చితకబాదారు. దీంతో సభా ప్రాంగణం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.