: తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న మాజీ ఎంపీ తనయుడు
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మాజీ ఎంపీ బీఎన్ రెడ్డి కుమారుడు చంద్రశేఖర్ రెడ్డి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ లోని తన స్వగృహంలో తుపాకీతో చంద్రశేఖర్ రెడ్డి తనను తాను కాల్చుకున్నారు. తీవ్రంగా గాయపడిన అతనిని కుటుంబ సభ్యులు హుటాహుటీన అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చంద్రశేఖర్ రెడ్డి మరణించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, చంద్రశేఖర్ రెడ్డి ఆత్మహత్యకు ఆర్ధిక సమస్యలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.