: హత్య కేసులో ఎమ్మెల్యే దోషి... అనర్హత వేటు
ఉత్తరప్రదేశ్ లోని చర్ఖారి ఎమ్మెల్యే కప్తాన్ సింగ్ రాజ్ పుత్ హత్యకేసులో దోషిగా తేలారు. దీంతో ఆయనపై అనర్హత వేటు పడనుంది. పదమూడేళ్లుగా విచారణ జరుగుతున్న ఓ హత్య కేసులో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కప్తాన్ సింగ్ , ఆయన సోదరుడు లక్ష్మణ్ సింగ్ లను దోషులుగా న్యాయస్ధానం నిర్ధారించింది. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు, జైలుకు తరలించారు. అతని శిక్షను న్యాయస్థానం సోమవారం ఖరారు చేయనుంది. కాగా, దోషిగా నిర్ధారణ అయిన కప్తాన్ సింగ్ పై అనర్హత వేటు పడనుంది.