: పెళ్లి ప్రకటనే పెట్టుబడిగా 35 లక్షలకు టోకరా!


కేవలం పెళ్లి ప్రకటనే పెట్టుబడిగా 35 లక్షల రూపాయలకు టోకరా ఇచ్చిందో ఘరానా మోసగత్తె. విషయం బట్టబయలు కావడంతో పోలీస్ స్టేషన్లో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. బేగంపేటకు చెందిన మాళవిక (32) వరుడు కావాలంటూ మ్యాట్రిమోని డాట్ కామ్ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్‌ పెట్టింది. ఆ ప్రొఫైల్‌ లో అమెరికాలో పుట్టానని, ఇండియాలో అమ్మమ్మ మరణంతో, తాతయ్య ఆరోగ్యం చూసుకునేందుకు భారత్ లో ఉండిపోయానని, చిన్న పిల్లల డాక్టర్‌ నని, నెలకు లక్షల్లో సంపాదిస్తానని పేర్కొంది. ఆమె ప్రొఫైల్‌ ను చూసి అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు జి.ప్రశాంత్ ఆమెను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. ఆమెతో ప్రేమలో పడ్డ అతగాడు ప్రతిరోజు సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్‌ లో వీడియో చాట్ చేసేవాడు. దీనిని ఆసరాగా చేసుకున్న ఆమె, తన అవసరాల నిమిత్తం కొంత డబ్బు కావాలని కోరడంతో ఆమె అకౌంట్‌లోకి విడతల వారీగా మొత్తం రూ.35 లక్షల రూపాయలు ట్రాన్స్‌ ఫర్ చేశాడు. పెళ్లి చేసుకునేందుకు గత నవంబర్‌ లో ప్రశాంత్ ఇండియాకు వచ్చాడు. అనంతరం ఆమెకు పెళ్లైందని, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారని గుర్తించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సీసీఎస్ పోలీసులకు ఆమెపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై చీటింగ్ కేసు నమోదైంది. ఆమె మకాం మార్చడంతో కాస్త కష్టమైనప్పటికీ విజయవంతంగా పోలీసులు ఆమె ఆచూకీ కనుగొన్నారు. విచారణకు సహకరించేందుకు రావాలంటూ పోలీసులు పిలవడంతో స్టేషన్ కు వచ్చిన ఆమె, తన పరువు పోయిందంటూ స్టేషన్ లోనే పురుగుల మందు తాగింది. దీంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News