: బీజేపీలోకి మరోసారి మోదీ ప్రత్యర్థి?


ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యర్థి మరోసారి బీజేపీలోకి రానున్నారా?...బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సంజయ్ జోషీ అహ్మదాబాద్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ సదస్సుకు హాజరయ్యారు. 2005 నుంచి పార్టీకి దూరంగా ఉన్న ఆయన ఆర్ఎస్ఎస్ సదస్సుకు హాజరుకావడం ద్వారా మరోసారి పార్టీలోకి రానున్నారన్న సంకేతాలు పంపారు. కాగా సంజయ్ జోషి ప్రధాని నరేంద్ర మోదీకి బద్ధ శత్రువుగా పేరొందారు. ఆయన అవినీతికి పాల్పడినట్టు సీడీలు వెలుగులోకి రావడంతో 2005లో పార్టీ బహిష్కరణకు గురయ్యారు. తాజాగా ఆయన ప్రయత్నాలు, పార్టీ వైపు చూస్తున్నారన్న వ్యాఖ్యలకు బలమిస్తున్నాయి. కాగా, జోషీ పునఃప్రవేశంపై ప్రధాని మోదీ సానుకూలంగా లేరని సమాచారం. అయితే ఆర్ఎస్ఎస్ జోషీకి సొంత ఇల్లులాంటిదని బీజేపీ నేత మన్మోహన్ వైద్య తెలిపారు.

  • Loading...

More Telugu News