: జూన్ నాటికి నవ్యాంధ్ర రాజధాని మాస్టర్ ప్లాన్: ఏపీ మంత్రి నారాయణ
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని మాస్టర్ ప్లాన్ జూన్ నాటికి సిద్ధమవుతుందని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నేటి ఉదయం మంగళగిరిలో పర్యటించిన ఆయన పట్టణంలో పారిశుద్ధ్యంపై అధికారులతో సమీక్షించారు. సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్ లోగా రాజధాని మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తామని ప్రకటించిన ఆయన వెనువెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నెల 12న సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారన్నారు. ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి అంశంపై చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తారని ఆయన వెల్లడించారు.