: నీతి ఆయోగ్ ను వ్యతిరేకిస్తే... రీతి లేకుండా పోతారు: విపక్షాలపై వెంకయ్య ఫైర్


ప్రణాళిక సంఘం స్థానంలో కొత్తగా రూపుదిద్దుకుంటున్న 'నీతి ఆయోగ్'పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఒంటికాలిపై లేచారు. నీతి ఆయోగ్ ను విమర్శిస్తే... రీతి లేకుండా పోతారంటూ ఆయన ధ్వజమెత్తారు. విజయవాడలో పింగళి వెంకయ్య విగ్రహావిష్కరణలో పాల్గొన్న సందర్భంగా నేటి ఉదయం ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. మూస పద్ధతిలోని ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తూ, ప్రణాళికా రచనలో అన్ని రాష్ట్రాల సీఎంలకూ చోటు కల్పించిన తమ ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేస్తారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలుంటేనే ప్రభుత్వాలు తమ తప్పులను సరిదిద్దుకునే వెసులుబాటు ఉంటుందన్న వెంకయ్య, విపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదన్నారు.

  • Loading...

More Telugu News