: ఫ్యాన్సీ నెంబర్ల పేరుతో నలుగురు ఎమ్మెల్యేలకు టోకరా... లక్షలు స్వాహా


ఎంత ఎమ్మెల్యేలయినా వారు కూడా మానవమాత్రులే కదా. ఫ్యాన్సీ నంబర్ల మోజులో ఓ మాయగాడి మాటలు నమ్మి బోల్తాపడ్డారు. వివరాల్లోకి వెళితే, మద్దుల బాబు అలియాస్ దీపక్ అనే మోసగాడు తాను ఓ ప్రముఖ సెల్ కంపెనీకి చెందిన సీఈఓనని చెప్పుకుని ఎమ్మెల్యేలతో పాటు పలువురిని బుట్టలో వేసుకున్నాడు. కథ మొత్తం ఫేస్ బుక్ లోనే నడిపాడు. అయ్యగారి మాటలు నమ్మి ఫ్యాన్సీ నంబర్ కోసం అతను చెప్పిన అకౌంట్లోకి ఆన్ లైన్ లో డిపాజిట్ చేశారు మన ప్రజాప్రతినిధులు. ఆ తర్వాత తెలిసింది తాము మోసపోయామని. దీపక్ మాయలోపడి డబ్బు డిపాజిట్ చేసిన వారు వీరే. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రూ. 9.27 లక్షలు, ఒంగోలు ఎమ్మెల్యే జనార్ధన్ రూ. 4 లక్షలు, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ రూ. 64 వేలు, గోపాలపురం ఎమ్మెల్యే రూ. 42 వేలు డిపాజిట్ చేశారు. నిందితుడిపై ప్రకాశం జిల్లాలో రెండు కేసులు నమోదుకాగా... పోలీసులు అతడిని పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

  • Loading...

More Telugu News