: అరేబియా జలాల్లో తప్పించుకుపోయిన మరో 'ఉగ్ర' పడవ!


భారత్ మీద ఉగ్రదాడి చేయడానికి రెండు పడవల్లో ముష్కరులు వచ్చారా? అవుననే అంటున్నారు అధికారులు. గురువారం నాటి ఘటనలో ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారని భావిస్తున్న ఓ పడవ అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. అదే సమయంలో వారి వెనుక వస్తున్న మరో పడవ వెనక్కు మళ్లిందని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. భారత్, పాకిస్తాన్ జలాల సరిహద్దులో రెండో అనుమానిత 'ఉగ్ర' పడవను భారత దళాలు గుర్తించాయని, ఇది కూడా కరాచీ నుంచి వచ్చిందని తెలిపారు. భారత ఫిషింగ్ బోట్లలో కలిసిపోయి తీరం చేరాలన్నది వారి పన్నాగంగా తెలుస్తోందని వివరించారు. తమను భారత దళాలు గుర్తించాయని తెలుసుకున్న ఉగ్రవాదులు తిరిగి పాకిస్తాన్ జలాల్లోకి వెనుదిరిగినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News