: ముక్కలైన ఎయిర్ఏషియా విమానం... బెల్టులతో సీట్లలోనే మృతదేహాలు!
గత వారం జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ఏషియా విమానం నీటిలో మునిగే సమయంలో ముక్కలు ముక్కలయిందా? సముద్ర తీరంలో దొరికిన ఐదు మృతదేహాలు బెల్టులతో సీట్లకు కట్టబడి ఉండటాన్ని గమనిస్తే అవుననే అనిపిస్తోంది. విమానం ముక్కలు కాకుంటే, సీట్లు విడిపోయి పైకి తేలడం అసాధ్యం. కాగా, భారీ అలలు, ఉద్ధృతమైన గాలుల కారణంగా, గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నట్టు ఇండోనేషియా అధికారి ఒకరు తెలిపారు. విమానం తోక భాగం మాత్రం సముద్రంలో 29 మీటర్ల కింద ఉన్నట్టు గుర్తించామని తెలిపారు.