: సూపర్ మ్యాన్ వేషం వాసిన షేన్ వార్న్
ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ కొత్త సంవత్సరాదిని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. సూపర్ మ్యాన్ వేషం వేసిన వార్న్ సిడ్నీలో మిత్రులతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నాడు. ఇక, వార్న్ కు జతగా మోడల్, ఫొటోగ్రాఫర్ రొసాన్నా ఫరాసీ క్యాట్ ఉమన్ వేషధారణలో కనిపించగా, అందాల మోడల్ కిర్ స్టీ లీ వండర్ ఉమన్ గా దర్శనమిచ్చింది. వేడుకల తాలూకు ఫొటోలను వార్న్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేశాడు. ఈ సూపర్ హీరోలందరూ 2015లో ఆస్ట్రేలియాను సురక్షితంగా ఉంచుతారని ట్వీట్ కూడా చేశాడు.