: వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్టు
హైదరాబాదులో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. వనస్థలిపురంలో గుట్టుగా సాగుతున్న వ్యభిచార గృహాలపై సైబరాబాద్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన మహిళల్లో జూనియర్ ఆర్టిస్ట్ కృష్ణవేణి ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి సంరక్షణాలయానికి తరలించారు. నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగలు ఉండడంతో వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.