: కోస్ట్ గార్డ్ కి అభినందనలు: కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్
భారత్ లో ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ మరపడవను వెంబడించి వారి కుట్రను భగ్నం చేసినందుకు తీర రక్షక దళ సిబ్బందికి కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అభినందనలు తెలిపారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. తీర ప్రాంత సిబ్బంది ఆ మరపడవను పట్టుకునేందుకు ప్రయత్నించే లోపు పేలిపోవడంలో ఏదో అంతరార్థం ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, కేంద్ర మంత్రి రాథోడ్ గతంలో ఆర్మీలో విధులు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.