: ఏపీని తాకట్టు పెట్టేస్తారా?: వాసిరెడ్డి పద్మ
ఆంధ్రప్రదేశ్ ను బహుళ జాతీయ సంస్థ (ఎంఎన్సీ) లకు తాకట్టు పెట్టేస్తారా? అని వైఎస్సార్సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఎంఎన్సీ రిటైల్ అవుట్ లెట్లకు సీఎం అనుమతినివ్వడం దారుణమని అన్నారు. ఎంఎన్సీల అనుమతుల వెనుక ఉన్న గుట్టేమిటని, ఎంఎన్సీలకు అనుమతులు ఇచ్చినందుకు ఎన్ని వేల కోట్లు ముడుపులు ముట్టాయని ఆమె నిలదీశారు. గతంలో ఎఫ్ డీఐలను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడెందుకు అనుమతులు ఇచ్చారని ఆమె అడిగారు. ఇప్పుడు కోట్లాదిమంది చిల్లర వర్తకులు గుర్తుకు రాలేదా? అని అడిగిన ఆమె, ప్రతిపక్షంలో ఉంటే ఒకలా, అధికారంలో ఉంటే మరోలా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు.