: ఫేస్ బుక్ లో మాజీ భర్తపై దుష్ప్రచారం... మహిళకు 8 లక్షల జరిమానా


భర్త నుంచి విడిపోయిన ఓ మహిళ, సామాజిక అనుసంధాన వేదికలో మాజీ భర్తపై దుష్ప్రచారం చేయసాగింది. ఆస్ట్రేలియా దేశానికి చెందిన మిరో డబ్రోస్కీ 18 ఏళ్లపాటు తనకు నరకం చూపాడని, అందుకే అతని నుంచి విడిపోయానని రాబిన్ గ్రీవ్యూ అనే మహిళ డిసెంబర్ 12న ఫేస్ బుక్ లో పేర్కొంది. దీంతో, ఆగ్రహించిన మిరో డబ్రోస్కీ తన మాజీ భార్య లేనిపోని ఆరోపణలు చేస్తూ, తన పరువుకు భంగం కలిగిస్తోందని పేర్కొంటూ పశ్చిమ ఆస్ట్రేలియాలోని డిస్ట్రిక్ కోర్టులో పరువునష్టం దావా వేశాడు. దీనిని విచారించిన న్యాయస్థానం రాబిన్ ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆమెను డబ్రోస్కీ వేధించినట్టు ఆధారాలు లేవని పేర్కొంటూ, మాజీ భర్తపై అసత్య ప్రచారం చేసినందుకు 8 లక్షల రూపాయల జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News