: బీజేపీలో చేరనున్న బాబూలాల్ మరాండీ
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ వికాస్ మోర్ఛా పార్టీ అధినేత బాబూలాల్ మరాండీ బీజేపీలో చేరనున్నారు. తన మద్దతుదారులతో కలిసి ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆయన సన్నిహిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అయితే, ఇటీవల జార్ఖండ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జార్ఖండ్ వికాస్ మోర్ఛా పార్టీని అక్కడి ప్రజలు తిరస్కరించారు. బాబాలాల్ మరాండీ కూడా ఓటమిపాలయ్యారు.