: ఈనెల 26న కలవనున్న చంద్రబాబు, కేసీఆర్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 26న కలవబోతున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో ఆరోజు నిర్వహించే కార్యక్రమం ఇందుకు వేదికకానుంది. నిన్న(గురువారం) సాయంత్రం నిర్వహించిన ప్రజా దర్బార్ లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ మేరకు ప్రకటించారు. రెండు రాష్ట్రాల సమస్యలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు వారితో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తానని గవర్నర్ తెలిపారు. గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తొలిసారి ఇద్దరు ముఖ్యమంత్రులు రాజ్ భవన్ లో కలిసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News