: జయలలిత పిటిషన్ పై నేడు ప్రత్యేక బెంచ్ విచారణ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన పిటిషన్ పై కర్ణాటక హైకోర్టుకు చెందిన జస్టిస్ సీఆర్ కుమారస్వామి నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ నేడు విచారణ చేపట్టనుంది. దాంతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ ను బెంచ్ విచారణకు స్వీకరించనుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమకు విధించిన జైలు శిక్షను జయ, ఇతరులు పిటిషన్ రూపంలో సవాల్ చేశారు. కాగా, ఈ పిటిషన్ ల విచారణకు నిన్న(గురువారం) రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేసినట్టు కర్ణాటక హైకోర్టు వెబ్ సైట్ లో తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం మూడు నెలల్లో ఈ కేసులో విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది.