: హైదరాబాద్ లో న్యూ ఇయర్ ఖర్చు రూ.180 కోట్లు!


కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని గురువారం హైదరాబాదీలు ఖర్చు చేసింది ఎంతో తెలుసా? ఆ ఒక్క రాత్రిలోనే విందు, వినోదాల కోసం హైదరాబాదీలు ఏకంగా రూ.180 కోట్లు వెచ్చించారట.అయితే బయట స్టార్ హోటళ్లు, రిసార్టుల్లో జరిగిన వేడుకలతో పాటు తమ సొంత గృహాల్లో చేసుకున్న చిన్నపాటి వేడుకల ఖర్చులన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇక ఈ మొత్తం వ్యయంలో ఏ అంశానికి ఎంతేసి ఖర్చు పెట్టారన్న అంశాన్ని పరిశీలిస్తే, ఒక్క మద్యం కొనుగోలుకే రూ.80 కోట్లను నగరవాసులు తగలేశారట. కేక్స్, కూల్ డ్రింక్స్ కోసం రూ.15 కోట్లు ఖర్చుపెట్టిన నగరవాసులు, ఆహార పదార్థాల కోసం రూ.25 కోట్లను వెచ్చించారట. ఇక టాలీవుడ్ తారలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీల హంగామాతో హోరెత్తిన ఈవెంట్ల కోసం హైదరాబాదీలు రూ.60 కోట్లను ఖర్చు చేశారని తేలింది.

  • Loading...

More Telugu News