: కేసీఆర్ పై కోమటిరెడ్డి ప్రశంసల జల్లు: ‘ఆసరా, సన్నబియ్యం’ పథకాలు చరిత్రాత్మకం
తెలంగాణ సీఎం కేసీఆర్ పథకాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన ఆసరా, వసతి గృహాలకు సన్నబియ్యం పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం నల్లగొండలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి, కేసీఆర్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న సర్కారుకు తన సహకారం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.