: పటాస్ ఆడియో ఆవిష్కరించిన జూనియర్ ఎన్టీఆర్, రవితేజ
నటుడు కల్యాణ్ రామ్ నటించిన 'పటాస్' ఆడియోను ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, రవితేజ ఆవిష్కరించారు. హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో ఆడియో వేడుక జరిగింది. ఆడియో విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్ తొలి ఆడియో సీడీని రవితేజకు అందించారు. అనంతరం ఆడియో సీడీలను సినిమా యూనిట్, ఆడియో ఆవిష్కరణకు వచ్చిన ప్రముఖులకు అంజేశారు. ఈ కార్యక్రమంలో పూరీ జగన్నాథ్, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. సాయికార్తీక్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో పాటలు బాగున్నాయని అన్నారు. సినిమాకు కొత్త దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.