: అవన్నీ పుకార్లు... పీఎంవో నన్ను సంప్రదించలేదు: అమితాబ్


ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సంబంధించి ప్రచారచిత్రాల్లో తాను నటించడం లేదని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. ప్రధానితో పాటు అమితాబ్ ఓ టీవీ ప్రకటన చిత్రంలో నటిస్తున్నారని, భారతదేశ సమ్మిళిత అభివృద్ధి కోసం కుల మతాలకు అతీతంగా భారతీయులంతా కలిసి రావాలని అందులో ఆయన కోరుతారని గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై ప్రధాని కానీ, ప్రధాని కార్యాలయం కానీ తనను సంప్రదించలేదని అమితాబ్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News