: శేషాచలం అడవుల్లో అరుదైన పాము గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం అడవుల్లో అరుదైన సర్పజాతిని కనుగొన్నారు. ఇది శ్రీలంకలో అత్యధికంగా కనిపిస్తుంది. దీని సాంకేతిక నామం క్రైసోపేలియా టాప్రోబనికా స్మిత్. మెట్ట ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జీవవైవిధ్య సమాచారం అందించే 'చెక్ లిస్ట్' అనే జర్నల్ వార్షిక సంచికలో ఈ పాముకు సంబంధించిన వివరాలను తెలిపారు. శేషాచలం అడవుల్లోని చామల ప్రాంతంలో ఈ పామును గుర్తించినట్టు పేర్కొన్నారు. శ్రీలంక వెలుపల ఈ జాతి పాము కనిపించడం ఇదే ప్రథమం. అయితే, 2000 సంవత్సరంలో ఏపీలోని రిషీ వ్యాలీలో కనిపించిన ఓ పాము ఈ జాతికి చెందినదే అని భావించినా, దానిపై స్పష్టత లేదు.