: మిత్రుల కోసం గరిటె తిప్పిన సచిన్
భారత క్రికెట్ దేవుడు సచిన్ భోజన ప్రియుడన్న సంగతి తెలిసిందే. క్రికెట్ ఆడిన రోజుల్లో, మ్యాచ్ లు జరిగే వేదికల చుట్టుపక్కల మంచి వంటకాలు ఎక్కడ దొరుకుతాయని వాకబు చేయడం, కొత్త డిషెస్ ఉన్నాయని తెలిస్తే జూనియర్లను వెంటేసుకుని వెళ్లి లాగించడం సచిన్ కు అలవాటే. ఇక, మ్యాచ్ లు ఏవీ లేకపోతే మిత్రులకు వండివార్చడంలో సంతోషాన్ని వెతుక్కుంటాడు. తాజాగా, 45 మంది మిత్రుల కోసం ఈ ముంబైవాలా మరోసారి గరిటె తిప్పాడు. తాను బాగా చేయగలిగిన బైంగన్ భర్తా వండాడు. దాని రెసిపీని సచిన్ తన తల్లి నుంచి నేర్చుకున్నాడట. తాను కిచెన్ లో వండుతున్నప్పటి ఫొటోను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు సచిన్.