: గవర్నర్ తో గంటన్నర సేపు భేటీ అయిన కేసీఆర్


రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. పుష్పగుచ్ఛాన్ని అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారిరువురూ దాదాపు గంటన్నర సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలకు చెందిన పలు సమస్యలపై వారు చర్చలు జరిపారు. వాటిలో ఎంసెట్ నిర్వహణ, నీటి వివాదాలు, 9, 10వ షెడ్యూల్ తదితర అంశాలు ఉన్నాయి. అనంతరం, ఈ నెల 26న సాయంత్రం మరోసారి రాజ్ భవన్ రావాలని కేసీఆర్ ను గవర్నర్ కోరారు. ఆరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వస్తున్నారని కేసీఆర్ కు నరసింహన్ తెలిపారు.

  • Loading...

More Telugu News