: రాయితీయేతర గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
కొత్త ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం రాయితీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గించింది. ఒక్కో సిలిండర్ పై రూ.43.50 పైసలు తగ్గించింది. దాంతో, ఇంతవరకు రూ.752 ఉన్న 14.2 కేజీల సిలిండర్ ధర ఇకనుంచి రూ.708.50 పలకనుంది. అటు అంతర్జాతీయ చమురు రేట్లు తగ్గడంతో విమాన ఇంధనం ధరను 12.5 శాతం ప్రభుత్వం తగ్గించింది. రాయితీయేతర, మార్కెట్ ధరకు లభించే ఎల్పీజి సిలిండర్ల ధర వరుసగా ఆరవసారి తగ్గింది.