: తుళ్లూరులో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన రైతులు
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం తుళ్లూరులో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజధాని ప్రకటన వెలువడిన తర్వాత తుళ్లూరులో తొలి బహిరంగసభకు చంద్రబాబు హాజరయ్యారు. తుళ్లూరు జడ్పీ పాఠశాల నుంచి మేరీమాత పాఠశాల వరకు ఆయన ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.