: స్వర్ణ రథంపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు


వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారు తిరు వీధుల్లో విహరించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి స్వర్ణరథంపై ఊరేగారు. కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో వీక్షించారు. తిరు వీధులు గోవింద నామ స్మరణతో మారుమోగాయి. రథోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాలుపంచుకున్నారు. వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరం ఒకే రోజున రావడంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేశారు.

  • Loading...

More Telugu News