: విశాఖ, కాకినాడల్లో సముద్రుడి ఆగ్రహం
నూతన సంవత్సర వేడుకలను సముద్రతీరాన జరుపుకోవాలనుకుంటున్న ఔత్సాహికుల ఉత్సాహాన్ని నీరుగారుస్తూ విశాఖ, కాకినాడల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. కాకినాడ వద్ద బీచ్ రోడ్డుపైకి సముద్రం నీరు రాగా, విశాఖలోని యారాడలో చర్చి వరకూ నీరు వచ్చేసింది. దీంతో యారాడ గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.