: తప్పతాగి జడ్జిపైకి దూసుకెళ్లిన నెల్లూరు న్యాయవాది


న్యాయవాద వృత్తికి మచ్చ తెచ్చేలా నెల్లూరులో సుబ్రహ్మణ్యం అనే లాయర్ వ్యవహరించాడు. బుధవారం జరిగిందీ ఘటన. న్యాయం కోసం వాదించడం తన వృత్తి అని, ఆ వృత్తికి సమాజంలో ఎంతో గౌరవముందని మర్చిపోయిన ఆ న్యాయవాది మద్యం తాగి జిల్లా కోర్టుకు వచ్చాడు. కిక్కు తలకెక్కడంతో విచక్షణ వదిలేసి, ఎదురుగా కనిపిస్తున్న జడ్జిపైకి దూసుకెళ్లాడు. నోటికొచ్చిన విధంగా తిట్టడంతో ఆ న్యాయమూర్తికి బాగా కోపం వచ్చింది. దీంతో, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు తాగుబోతు లాయర్ ను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News