: కొత్త సంవత్సర వేడుకల పర్యవేక్షణకు డ్రోన్ కెమెరాలు


నూతన సంవత్సర వేడుకల్లో బెంగళూరు పోలీసులు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగించనున్నారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు బెంగళూరు పోలీసులు డ్రోన్ కెమెరాలు ఉపయోగించాలని నిర్ణయించారు. నాలుగు రోజుల క్రితం బెంగళూరులో బాంబు పేలుడు సంభవించిన నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగించనున్నారు. కాగా, నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనే వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News