: గిరిజనులను విడిచిపెట్టిన మావోయిస్టులు
మావోయిస్టులు ప్రభుత్వ, వివిధ ప్రజా సంఘాల ఒత్తిడికి తలొగ్గారు. తాము కిడ్నాప్ చేసిన గిరిజనులను విడిచిపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా చంతూరు మండలం పేగలో ఈ నెల 27న 13 మంది గిరిజనులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. దీంతో, అన్నివైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో, మావోలు బుధవారం తెల్లవారుజామున గిరిజనులను వదిలేశారు. మావోల చెర నుంచి బయటికి వచ్చిన గిరిజనులు క్షేమంగానే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.