: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజల కోరికలు, అవసరాలు తీరాలని ఆకాంక్షించారు. ఎన్నో పోరాటాల తరువాత తెలంగాణ రాష్ట్ర కల 2014లో నిజమైందని సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సంవత్సరంగా '2014' చరిత్రలో నిలిచిపోతుందని కేసీఆర్ పేర్కొన్నారు. 2015లో ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకువెళతాయని మీడియా సమావేశంలో చెప్పారు.