: సమైక్య రాష్ట్రంలో పాల ఉత్పత్తి నిర్వీర్యమైంది: పోచారం


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాల ఉత్పత్తి నాశనమైందని టీఎస్ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో పాడి రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు. నాబార్డ్ ద్వారా నిరుద్యోగులకు రుణాలిచ్చి, పాడి పరిశ్రమ అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని తెలిపారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు లీటర్ ధరపై రూ. 4 పెంచామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం దేపల్లి దగ్గర ఉన్న గో ఆధారిత పంట పొలాన్ని మంత్రులు పోచారం, లక్ష్మారెడ్డిలు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News