: తన 49 రోజుల పాలన 'రామరాజ్యం' అంటున్న కేజ్రీవాల్


గతేడాది డిసెంబర్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ 49 రోజుల పాటు పదవిలో కొనసాగారు. తాజాగా ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న ఆయన, ఆ పాలనను 'రామ రాజ్యం'తో పోల్చుకున్నారు. సీఎం పదవి నుంచి వైదొలగాలని తాను తీసుకున్న నిర్ణయానికి న్యాయం చేయాలని ప్రయత్నించానని చెప్పారు. రాజీనామా చేసి తప్పు చేసినా, అదేమీ నేరం కాదన్నారు. వచ్చే ఏడాదిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఓ ర్యాలీలో పాల్గొన్న కేజ్రీ ప్రసంగిస్తూ, "విద్యుత్ టారిఫ్ ను మా ప్రభుత్వం తగ్గించింది. ప్రతి ఇంటికీ 20వేల లీటర్ల ఉచిత మంచినీరు ఇచ్చింది. మా పాలనా సమయంలో ద్రవ్యోల్బణాన్ని కిందికి తెచ్చాం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... కాంగ్రెస్, బీజేపీలు గత 65 ఏళ్లలో నిర్మూలించలేని అవినీతిని మేం చాలామేరకు తగ్గించగలిగాం. 49 రోజుల మా ప్రభుత్వ పాలనను రామ రాజ్య పాలన అని ప్రజలు చెప్పుకున్నారు" అని కేజ్రీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News