: పేదల సొమ్మును కాజేస్తున్న తృణమూల్ నేతలు: కేంద్ర మంత్రి జవదేకర్
భూసేకరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలకు కారణమవుతోంది. ఈ ఆర్డినెన్సును టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ తప్పుబట్టిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ, భూసేకరణ బిల్లు రైతులకు మేలు చేస్తుందని చెప్పారు. టీఎంసీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని... పేదల సొమ్మును ఆ పార్టీ నేతలు కాజేస్తున్నారని ఆరోపించారు.