: రక్షణశాఖ ఆయుధ కొనుగోలు ఒప్పందాల్లో బ్రోకర్లకు అనుమతి
భవిష్యత్తులో భారత రక్షణశాఖ జరిపే ఆయుధ కొనుగోళ్ళ ఒప్పందాల్లో బ్రోకర్లను అనుమతిస్తామని ఆ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఈ మేరకు విదేశీ సంస్థల నుంచి వచ్చిన అధికార ప్రతినిధులకు ఆయన హామీ ఇచ్చారు. కొనుగోళ్ళ విషయంలో మధ్యవర్తుల ప్రమేయానికి అడ్డు చెప్పబోమని, అయితే కమిషన్లతో సంబంధం లేకుండా వారు డీల్స్ నడపాల్సి ఉంటుందని వివరించారు. వారి కంపెనీల తరఫున ప్రభుత్వ సమావేశాల్లో పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. కాగా, 1980లో బోఫోర్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తరువాత కొనుగోలు ఒప్పందాల్లో బ్రోకర్ల ప్రమేయాన్ని కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే.