: సింగరాయకొండలో ఇరువర్గాల మధ్య ఘర్షణ... యువకుడిపై గొడ్డలితో దాడి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపేటలో నేటి ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో మురళి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యర్థులు అతనిపై గొడ్డలితో దాడి చేశారు. దాంతో తీవ్ర గాయాలపాలైన అతడిని బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా వుంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఉద్రిక్తతలను చల్లబరిచే యత్నం చేస్తున్నారు.