: 2జీ కేసులో ప్రధాని, చిదంబరంలకు క్లీన్ చిట్?
సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కేసులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆర్ధిక మంత్రి చిదంబరంలకు పార్లమెంటరీ సంయుక్త సంఘం (జేపీసీ) క్లీన్ చిట్ ఇచ్చినట్టు అర్థమవుతోంది! ఈ కుంభకోణంలో ప్రధాని, చిదంబరంల పాత్ర ఏమీ లేదని గురువారం జేపీసీ వెల్లడించింది. స్పెక్ట్రమ్ కేటాయింపుల వ్యవహారంలో అప్పటి టెలికాం మంత్రి రాజాను ప్రధాని ఏ విధంగానూ ప్రభావితం చేయలేదని జేపీసీ అంటోంది. ఇక స్పెక్ట్రమ్ వేలం ప్రమాణాలను కొన్ని కంపెనీలకు అనుకూలంగా మార్చడంలోనూ మన్మోహన్, చిదంబరం పాత్ర ఏమీ లేదని కూడా జేపీసీ నివేదిక స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.