: కాల్పుల ఒప్పందం ఉల్లంఘించిన పాక్...తిప్పికొట్టిన భారత్
పాకిస్థాన్ వంకరబుద్ధి చూపించింది. భారత్-పాక్ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి పాక్ బలగాలు ఉల్లంఘించాయి. భారత్ భూభాగంలోని అఖ్నూర్ సెక్టార్ వద్ద భారత స్ధావరాలపై పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. పాక్ కాల్పులతో అప్రమత్తమైన భారత బలగాలు దీటుగా స్పందించాయి. దీంతో పాక్ బలగాలు తోకముడిచాయి.