: టీఆర్ఎస్ ఐదేళ్లు అధికారంలో కొనసాగే అవకాశం లేదు: కుంతియా
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో కొనసాగే అవకాశం లేదని ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సీ. కుంతియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదని అన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలా జరిగితే టీఆర్ఎస్ అధికార పీఠంపై ఐదేళ్లు కొనసాగే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు.