: ధోనీకి సచిన్ సలహా
టెస్టు క్రికెట్ కు మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంపై స్పందనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా, బ్యాటింగ్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. టెస్టు క్రికెట్ లో అద్భుతమైన కెరీర్ చవిచూసినందుకు ధోనీకి అభినందనలు తెలిపాడు. అంతేగాకుండా, ధోనీతో కలిసి ఆడడాన్ని ఎంతగానో ఆస్వాదించానని పేర్కొన్నాడు. చివరగా ఓ సలహా ఇచ్చాడు. ధోనీ ఇకపై వన్డే వరల్డ్ కప్ ను లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించాడు. "నెక్ట్స్ టార్గెట్ 2015 వరల్డ్ కప్ మై ఫ్రెండ్" అంటూ ట్వీట్ చేశాడు.